కేంద్రప్రభుత్వం సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలను ప్రతిపక్షాలను అణిచివేయడానికి ఉపయోగిస్తుందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరిపై ఈడీ, ఐటీ దాడులు కక్షపూరితవేనన్నారు. సుజనా చౌదరిపై జరుగుతన్న దుష్ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని సీఎం రమేష్ తెలిపారు. ఈ దాడులకు తెలుగుదేశం పార్టీ బెదరదని సీఎం రమేష్ తెలిపారు.