ఈసారి ఎండలను తట్టుకోవడం కష‌్టమేనట
ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈసారి ఎండలు తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సాధారణంగా మార్చి నెలలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. కానీ ఫిబ్రవరి మధ్యలోనుంచే ఎండలు అధికంగా ఉంటున్నాయి. ఈ నెలలో 35.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ఉష్ణోగ్రతలు...
ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు. ఎండాకాలం గతంలో మాదిరిగా అలా వచ్చి వెళ్లే అవకాశమూ లేదంటున్నారు. జూన్ వరకూ ఈ ఎండల తీవ్రత కొనసాగే అవకాశముందని కూడా హెచ్చరిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని ఎండల తీవ్రతను సూచిస్తుందని చెబుతున్నారు.