ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఇంకెంతకాలం ?

ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశాన్నినేడు సుప్రీంకోర్టు విచారించింది

Update: 2022-04-21 11:50 GMT

న్యూఢిల్లీ : ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశాన్నినేడు సుప్రీంకోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఇంకెంతకాలం కొనసాగిస్తారని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేసింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ ను కొనసాగించరాదన్న నిబంధనను ఈ సందర్భంగా గుర్తుచేసింది.

ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ విషయంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో తగిన నిర్దేశాలు కోరామని సుప్రీం ధర్మాసనానికి తెలుపగా.. సస్పెన్షన్ విధించి రెండేళ్లు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై రేపటి లోగా పూర్తి వివరాలు సమర్పించాలని.. మరోసారి ఈ విచారణను వాయిదా వేయడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది.




Tags:    

Similar News