పదోన్నత్తుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బుధవారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల డేటా సేకరించాల్సిన అవసరం లేదని చెప్పింది. కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయడానికి నిరాకరించింది. నాగరాజు(2006) కేసులో ఇచ్చిన తీర్పును పునసమీక్షించాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది.