వివాహేతర చట్టాలపై సుప్రీం కోర్టు కీలకతీర్పును వెల్లడించింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చింది. వివాహేతర సంబంధాల చట్టంలోని పలు నిబంధనలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్ ను సుప్రీం విచారించింది. వివాహమైతే పురుషులు భార్యలను తమ ఆస్తిగా భావిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. వివాహేతర సంబంధాల కారణంతో విడాకులు తీసుకోవచ్చని కానీ నేరంగా మాత్రం పరిగణించలేమని కోర్టు తేల్చి చెప్పింది. కాగా, వివాహేతర సంబంధం నేరంగా పరిగణించాలని కేంద్రం వాదించగా, సుప్రీం కోర్టు విభేదించింది.