బ్రేకింగ్: మమతా బెనర్జీకి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు

సీబీఐ విచారణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు షాకిచ్చింది. తమ విచారణకు బెంగాల్ సహకరించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సీబీఐ [more]

Update: 2019-02-05 06:19 GMT

సీబీఐ విచారణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు షాకిచ్చింది. తమ విచారణకు బెంగాల్ సహకరించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సీబీఐ నిన్న సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ ను ఇవాళ విచారించిన కోర్టు సీబీఐ విచారణకు కలకత్తా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. అసలు విచారణ హాజరయ్యేందుకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. అయితే, రాజీవ్ కుమార్ విచారణకు సహకరిస్తే అరెస్టు చేయవద్దని సీబీఐకి సూచించింది. కాగా, తామెప్పుడే సీబీఐ విచారణను అడ్డుకోలేదని, సీబీఐ వ్యవహరించిన తీరుపైనే అభ్యంతరాలు వ్యక్తం చేశామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారారని ఆమె పేర్కొన్నారు.

Tags:    

Similar News