బ్రేకింగ్ : ఎన్నికలపై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

Update: 2018-09-28 07:55 GMT

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. హడావుడిగా ముందస్తు ఎన్నికల నిర్వహణ వల్ల ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని, సుమారు 20 లక్షల మంది 18 ఏళ్లు నిండిన వారు ఓటు వేసే అవకాశం కోల్పోతున్నారని శశాంక్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అయితే, 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని మత్రమే ఓటర్లుగా పరిగణిస్తామని ఎననికల సంఘం వివరణ ఇచ్చింది. కానీ, ఎన్నికలు సరైన సమయంలో జరిగిన 2019 జనవరీ 1 నాటికి 18 ఏళ్లు నిండనున్న 20 లక్షల మంది అదనంగా ఓటు హక్కు వినియోగించుకునే వారని పిటీషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హడావుడి ఎన్నికల వల్ల పారదర్శకత లోపిస్తుందని చెప్పారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, వివరణ తర్వాత తదుపరి విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.

Similar News