ఏపీలో విజయం ఆ పార్టీదే..! జాతీయ సర్వే అంచనా
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయనున్నట్లు జాతీయ సర్వే సంస్థ వీడీపీ అసోసియేట్స్ అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయనున్నట్లు జాతీయ సర్వే సంస్థ వీడీపీ అసోసియేట్స్ అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయనున్నట్లు జాతీయ సర్వే సంస్థ వీడీపీ అసోసియేట్స్ అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో ఏకంగా 21 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని తేల్చింది. ఇక, అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని సర్వేలో తేలింది. ఆ పార్టీ కేవలం నాలుగు పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని తేల్చింది. మిగతా పార్టీలు ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదు. ఓట్ల శాతంలో కూడా టీడీపీ కంటే వైసీపీ చాలా ముందంజలో ఉంది. వైసీపీకి 45 శాతం, టీడీపీకి 37.20 శాతం, బీజేపీకి 7.13 శాతం, జనసేనకు 5.90 శాతం, కాంగ్రెస్ కు 2.20 శాతం, సీపీఎంకు 0.24 శాతం, సీపీఐకి .20 శాతం, ఇతరులకు 2.13 శాతం ఓట్లు దక్కుతాయని ఆ సంస్థ అంచనా వేసింది.