మరికాసేపట్లో తమిళనాడులో పళనిస్వామి భవితవ్యం తేలనుంది. మద్రాస్ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీర్పు మరికాసేపట్లో వెలువడనుంది. అనర్హత కేసును కొట్టివేస్తే పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో తీర్పు ఎలా వచ్చిన పళనిస్వామికి ఇబ్బంది తప్పదంటున్నారు. మూడో న్యాయమూర్తి తీర్పు నేడు కీలకం కానుంది. దినకరన్ వెంట 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరినీ దినకరన్ రిసార్ట్స్ కు తరలించారు. తమిళనాడులో మొత్తం 232 స్థానాలున్నాయి. స్పీకర్ ను మినహాయిస్తే 231 సభ్యులుంటారు. పళనిస్వామి వర్గంలో 110 మంది ఎమ్మెల్యేలున్నారు. డీఎంకే దాని మిత్ర పక్షాలు కలిపి 97 మంది సభ్యులున్నారు. డీఎంకే 88, కాంగ్రెస్ 8, ఐయూఎంల్ ఒకరు సభ్యులున్నారు. మ్యాజిక్ ఫిగర్ 117 కాగా పళనిస్వామికి 110 మంది మాత్రమే ఉన్నారు. అనర్హత వేటును కోర్టు సమర్థించినా ఉప ఎన్నికలు తప్పవు.