టీడీపీ కార్పొరేటర్లకు షో కాజ్ నోటీసులు

విశాఖపట్నంలో ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన ఏడుగురు కార్పొరేటర్లకు టీడీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యే [more]

Update: 2021-03-20 01:58 GMT

విశాఖపట్నంలో ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన ఏడుగురు కార్పొరేటర్లకు టీడీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలవడమే ఇందుకు కారణం. తమ డివిజన్ల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే నాగిరెడ్డిని కలిశామని టీడీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం దీనిపై ఆగ్రహంగా ఉంది. ప్రమాణస్వీకారం మరుసటిరోజే కలవాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తోంది. దీనిపై ఆ ఏడుగురు కార్పొరేటర్లకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

Tags:    

Similar News