మాట వినని నేతలు… చంద్రబాబుకు తలపోటు
క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వేళ నాయకుల వ్యక్తిగత ప్రకటనలు అధినేతకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఎవరికి వారే సీట్లు, పొత్తుల విషయమై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటంతో పార్టీలో [more]

క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వేళ నాయకుల వ్యక్తిగత ప్రకటనలు అధినేతకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఎవరికి వారే సీట్లు, పొత్తుల విషయమై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనసేనతో టీడీపీకి పొత్తు ఉంటుందని నిన్న టీజీ వెంకటేష్ ప్రకటించి పార్టీని ఇరుకున పడేశారు. మొన్న మంత్రి అయ్యన్నపాత్రుడు… పార్టీ వాదనకు వ్యతిరేకంగా రాష్ట్ర అభివృద్దికి బీజేపీ సహకరించిందని, కేంద్రమంత్రి గడ్కరి పొగిడి టీడీపీని ఇబ్బంది పెట్టారు. ఇక, ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా… తన కూతురికి చంద్రబాబు విజయవాడ పశ్చిమ టిక్కెట్ కేటాయించారని ప్రకటించుకున్నారు. ఈ ప్రకటనపై ఇతర టీడీపీ నేతలు, ఆశావహులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుకు నేతల వైఖరి తలపోటుగా మారింది.