చింతమనేని మరొకసారి…?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన రౌడీయిజాన్ని చూపించారు. తనకు ఎదురు మాట్లాడితే ఎవరిపైనైనా దాడి చేసే చింతమనేని ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ [more]

Update: 2019-04-05 11:16 GMT

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన రౌడీయిజాన్ని చూపించారు. తనకు ఎదురు మాట్లాడితే ఎవరిపైనైనా దాడి చేసే చింతమనేని ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై దాడికి దిగారు. ఇవాళ వట్లూరు పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో చింతమనేని అనుచరుడు టీడీపీకి ఓటేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు వైసీపీ నేతలకు సమాచారం అందింది. దీంతో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి తన అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అప్పుడే చింతమనేని కూడా అక్కడకు చేరుకొని వైసీపీ ఏజెంట్ శ్రీధర్ పై దాడికి దిగారు. చింతమనేని దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా చింతమనేని దుర్భాషలాడారు. చింతమనేని ఇటువంటి దాడులు చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ిఇలా అనేక వివాదాల్లో ఆయన ఉన్నారు.

Tags:    

Similar News