తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్లి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆయన సోమవారం కవిటి మండలం పనగానిపుట్టుగ గ్రామాంలో పర్యటించి తుఫాను బాధితులను పరామర్శించాలనుకున్నారు. గ్రామంలోకి వెళ్లిన ఆయన మాట్లాడుతూ... తుఫాను బాధితులను ప్రభుత్వం ఆదుకుంటోందని, అనని సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. దీంతో ప్రజలు తమకేం సౌకర్యాలు కల్పించలేదని, తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు కూడా రాలేదని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకేం సహయం అందించకుండానే ఎందుకు వస్తున్నారని వారు రామోహన్ నాయుడుని నిలదీశారు. దీంతో ఆయన వెనుదిరిగారు.