బయటకు వస్తే కఠిన చర్యలు…ప్రభుత్వ హెచ్చరిక

సాయంత్రం 7గంటల నుంచి రోడ్డు మీద ఎవరూ కన్పించడానికి లేదని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడవద్దని చెప్పినా ప్రజలు పట్టించుకోవడం [more]

Update: 2020-03-23 06:57 GMT

సాయంత్రం 7గంటల నుంచి రోడ్డు మీద ఎవరూ కన్పించడానికి లేదని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడవద్దని చెప్పినా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఎవరైనా రాత్రి 7గంటలు దాటి బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యావసరవస్తువుల కొనుగోళ్లకు మాత్రమే బయటకు రావాలని కోరారు. రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేశామన్నారు. ఆటోలు, క్యాబ్ లు రోడ్లపైకి రావద్దని సూచించారు. లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని కోరారు. లాక్ డౌన్ ను ప్రజలు సీరియస్ గా తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. రోడ్లపైకి సరైన కారణాలు లేకుండా ఎవరు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని షాపులు 7గంటలకు మూసివేయాలని కోరారు. ప్రజలు కూడా ఏడు గంటల తర్వాత బయటకు రావద్దని కోరారు.

Tags:    

Similar News