తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపపథ్యంలో పలు పార్టీలు తమదైన శైలిలో అడుగులు వేస్తున్నాయి. ఎవరికి వారు తమ పంథాన్ని నెగ్గించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఎలాగైన సరే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు కీలక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చేది తమ ప్రభుత్వమే, గెలుపు తధ్యమంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందుకోసం తమ కార్యాచరణ మొదలు పెట్టేసింది. ‘తిరగబడదాం.. తరిమికొడదాం.. అంటూ సరికొత్త నినాదంలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా కోర్టులు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వారి ప్రచారం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీరుపై ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా ప్రజలను కూడా భాగస్వామం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
కర్ణాటక తరహాలో రచించిన వ్యూహాన్ని తెలంగాణలో కూడా అనుసరించే విధంగా ప్లాన్ చేసుకుంటోంది. సోమవారం జరిగే స్క్రీనింగ్ కమిటీ భేటీలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా తవ్ర స్థాయిలో కృషి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మం చేస్తోంది. అలాగే ఢిల్లీ అధిష్టానం సూచనల మేరకు ముందు వెళ్లేలా ప్లాన్ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, పార్టీని గెలిపించుకునేందుకు ఆ బాధ్యత ప్రతి ఒక్కరి భుజన వేసుకోవాలని ఢిల్లీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది.
ఇవాళ గాంధీ భవన్‌లో జరిగే పీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు సీనియర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణపై స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది. ఈ మేరకు మురళీధరన్ హైదరాబాద్ చేరుకోగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్, ఉత్తమ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల రోడ్ మ్యాప్, కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క్, సీనియర్ నేతలు పాల్గొనున్నారు.