బ్రేకింగ్ : సమ్మెపై సై సీరియస్

ఆర్టీసీ కార్మికులు 13 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా ఇటు ప్రభుత్వం, అటు ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగలేదు. కార్మికుల సమస్యలపై పలుమార్లు ఆర్టీసీ జేఏసీ తో [more]

Update: 2019-10-17 11:57 GMT

ఆర్టీసీ కార్మికులు 13 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా ఇటు ప్రభుత్వం, అటు ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగలేదు. కార్మికుల సమస్యలపై పలుమార్లు ఆర్టీసీ జేఏసీ తో పాటు తెలంగాణ బీజేపీ నాయకులు తెలంగాణ గవర్నర్ తమిళ సైకి వివరించారు. రోజు రోజుకు సమస్య ముదిరిపోతొంది. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళసై ఆర్టీసీ సమ్మెపై ఆరా తీశారు. రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజేయ్ తో ఫోన్ లో మాట్లాడారు. మంత్రి కార్యదర్శి గవర్నర్ వద్దకు వెళ్లి ఆర్టీసీ సమ్మెపై వివరించినట్లు తెలిసింది. కాసేపట్లో మంత్రి అజయ్ కూడా గవర్నర్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.

 

 

Tags:    

Similar News