బ్రేకింగ్ : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు
అవినాష్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గతవారం రెండ్రోజుల పాటు అవినాష్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత
వివేకా హత్యకేసులో సీబీఐ నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత శుక్ర, శనివారాల్లో (మే26,27) అవినాష్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత, సీబీఐ వాదనలు విన్న కోర్టు అవినాష్ ను అరెస్ట్ చేయవద్దంటూ సీబీఐను ఆదేశించింది. తదుపరి బెయిల్ పై తీర్పును నేటికి వాయిదా వేసింది. నేడు అవినాష్ రెడ్డికి మూడు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది. అలాగే రూ.5 లక్షల పూచీకత్తుతో రెండు షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి శనివారం సీబీఐ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణకు సహకరించాలి. బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే సీబీఐ ఓపెన్ కోర్టుకు వెళ్లవచ్చని తెలిపింది. దీంతో అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణ చేయాలని భావిస్తోన్న సీబీఐ సీబీఐకి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు వేళ తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని నిందితుడిగా పేర్కొంటున్న సీబీఐ.. అవినాష్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా చూపించలేకపోయిందని తెలిపింది. దస్తగిరి చెప్పిన వాంగ్మూలం ఆధారంగానే కేసు విచారణ జరుగుతుంది కానీ.. డైరెక్ట్ గా ఒక్క సాక్ష్యం కూడా లేదని పేర్కొంది. కొన్ని మీడియా సంస్థల్లో జడ్జిపై వచ్చిన ఆరోపణలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి బెయిల్ విచారణలో ఉన్న జడ్జికి డబ్బులు అందాయని, అందుకే ఆయన అవినాష్ కు సపోర్ట్ గా ఉన్నారని వచ్చిన వార్తలను ఆర్డర్ కాపీలో మెన్షన్ చేశారు. ఈ తరహా వార్తలపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని జడ్జి పేర్కొన్నారు.