బ్రేకింగ్ : ప్రజలెవరూ ఇళ్లు దాటి రావద్దు…. 31వ వరకూ లాక్ డౌన్

ఈరోజు కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఐదుగురు విదేశాల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. వారికి ట్రీట్ మెంట్ [more]

Update: 2020-03-22 13:14 GMT

ఈరోజు కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఐదుగురు విదేశాల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. వారికి ట్రీట్ మెంట్ మొదలు పెట్టారని తెలిపారు. ఈరోజు నుంచి విదేశీ ప్రయాణీకులు రావడం ఆగిపోతుందన్నారు. ఆ ప్రమాదం కొంత వరకూ తప్పినట్లేనని చెప్పారు. మార్చి 31వ తేదీ వరకూ ఇళ్లకే పరిమితమయితే కరోనా వైరస్ ను తరిమి కొట్టివచ్చని కేసీఆర్ తెలిపారు. ఐదుగురి మించి ఎక్కువగా గుమికూడ వద్దని చెప్పారు. 1897 అత్యవసర చట్టం ప్రకారం తెలంగాణ మొత్తం కర్ఫ్యూ అమల్లో ఉంటుందని చెప్పారు. నిత్యావసర వస్తువులను తెచ్చుకునేందుక ఇంటికి ఒకరిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ప్రజలు ఎవరూ ఇళ్లు దాటి రావద్దు అని విజ్ఞప్తి చేశారు. వారం నియంత్రణ జీవితాలను కాపాడుతుందన్నారు.

నిరుపేదలను ఆదుకుంటాం…..

నిరుపేదలకు నెల రోజులకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా ఇస్తామన్నారు. నిత్యవసర వస్తువుల కొనుగోలుకు రూ.1500లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వోద్యోగులు ఎవరూ కార్యాలయాలకు రావాల్సిన పనిలేదన్నారు. అత్యవసర సర్వీసుల ఉద్యోగులు అందరూ రావాలని, మిగిలిన శాఖలు మాత్రం రొటేషన్ పద్ధతిలో 20 శాతం మంది మాత్రమే హాజరవుతారన్నారు. విద్యాశాఖకు సంబంధించి అన్ని కార్యక్రమాలూ మూసివేస్తామని చెప్పారు. ప్రయివేటు కంపెనీలు కార్మికులకు వారి వేతనాలను చెల్లించాల్సిందేనని తెలిపారు. అంగన్ వాడీ సెంటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడా తిరగవన్నారు. ప్రయివేటు వాహనాలను కూడా అనుమతించబోమని చెప్పారు. రాష్ట్రం సరిహద్దులన్నీ మూసివేస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువులు మినహా మరే వాహానాన్ని తెలంగాణలోకి అనుమతించబోమన్నారు.

శిరసు వంచి నమస్కరిస్తున్నా…..

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజల నుంచి స్పందన వచ్చిందన్నారు. జనతా కర్ఫ్యూ విజయవంతమయిందన్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారన్నారు. ఐదుగంటలకు ప్రజలంతా కలిసి అద్భుతమైన సంఘీభావాన్ని సంకేతాన్ని తెలిపారు. ప్రజలు గొప్పగా సహకరించారన్నారు. ప్రతి ఒక్కరికీ తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రతిరోజూ వైద్యఆరోగ్యశాఖ బులిటెన్ రిలీజ్ చేస్తుందని చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే త్వరలోనే ఈ మహమ్మారిని తరిమికొట్టవచ్చన్నారు.

Tags:    

Similar News