మంత్రి తలసానికి క్లీన్ చిట్

తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఒక కేసులో క్లీన్ చిట్ లభించింది. ఎంపీ, ఎమ్మెల్యేల మీదున్న కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక [more]

Update: 2020-10-13 14:36 GMT

తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఒక కేసులో క్లీన్ చిట్ లభించింది. ఎంపీ, ఎమ్మెల్యేల మీదున్న కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు విచారణ అనంతరం తీర్పు వెలువరించింది. తలసానితో పాటు మరి కొందరిపై మోపిన రెండు వేరు వేరు కేసులలో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా పేర్కొంటూ నాంపల్లి 2వ సెషన్ కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఆ కేసుల విషయానికి వస్తే 2009 సంవత్సరం ఏప్రిల్ 13 వ తేదీన సికింద్రాబాద్ లోని అడ్డగుట్ట క్రాస్ రోడ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా స్టేజి ని ఏర్పాటు చేశారనే కారణంతో అప్పటి తుకారాం గేట్ పోలీసులు ఎ1 గా అజయ్ బాబు, ఎ 5 గా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పేర్కొంటూ మొత్తం ఐదు గురిపై 188, 290, 143 సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేశారు . అలాగే 2014 సంవత్సరంలో నిబంధనలకు విరుద్దంగా పాదయాత్రను నిర్వహించారని ఎ 1గా ఎంఎన్.శ్రీనివాస్, ఎ 2 గా తలసాని శ్రీనివాస్ యాదవ్ లను పేర్కొంటూ వీరిద్దరి పై 188, 76 సీపీ యాక్ట్ క్రింద గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ రెండు కేసులని విచారించిన కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కేసులో పేర్కొన్న వారందరిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది.

Tags:    

Similar News