తెలంగాణ ఏర్పడింది సెంటిమెంట్ మీద. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం లోకి వచ్చింది సెంటిమెంట్ మీదే. రాజకీయాల్లో పండేది కులం, మతం, ప్రాంతం సెంటిమెంట్లే. మరి సమయం ఆసన్నమైంది. దాంతో టి సెంటిమెంట్ కి వీలైనంత అధిక ప్రాధాన్యం ఇస్తుంది గులాబీ పార్టీ. ఆ పార్టీకి కెసిఆర్ కాక ప్రధాన వక్తలైన కేటిఆర్, కవిత సెంటిమెంట్ బాగా పండించే పనిలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రతి సభలోను వారిద్దరూ యువత ఓట్లను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో లోపాలను గట్టిగా ఎత్తిచూపుతున్నారు.
సింహం కావాలా ..? సీల్డ్ కవర్ కావాలా ...?
ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్ సీఎం కావాలా ? లేక గల్లీలో అందుబాటులో వుండే సింహం లాంటి కెసిఆర్ సీఎం కావాలో తేల్చుకోవాలనే ప్రచారం టీఆరెస్ బాగా. మొదలు పెట్టేసింది. అమరావతికి దాసుడు కావాలా ? ఢిల్లీ కి గులాం అయ్యేవారు కావాలా అంటూ కెటిఆర్, కవిత సెంటిమెంట్ రాజేశారు. బ్రాండ్ కెసిఆర్ పేరుతొ టి సర్కార్ చేపట్టిన ఈ ప్రచారం హోరెత్తిపోతుంది.
ఆత్మగౌరవం కోసమే....
తెలంగాణ సాధించింది ఆత్మగౌరవం కోసం తప్ప అధికారం కోసం కాదంటూ వారిద్దరూ దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ అనైతిక పొత్తు పెట్టుకుంటుందన్నారు. తెలంగాణలో అమరులైన వారు చెప్పారనా? కోదండరామ్ ఆ పార్టీలతో కలసి వెళుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రా పెత్తనం తెలంగాణపై రుద్దేందుకు మరోసారి ప్రయత్నాలు మొదలయ్యాయని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి అధికార విపక్షాల పోరులో త్వరలో అన్ని అస్త్రాలు మొదలౌతాయంటున్నారు విశ్లేషకులు.