లాక్ డౌన్ లో చిక్కుకున్న వేయి మంది రేపు?

కాశీలో చిక్కుకుని పోయిన తెలుగు వారికి విముక్తి కల్పించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో నుంచి కాశీకి వెళ్లిన వారిని తిరిగి పంపించేందుకు ఏర్పాటు [more]

Update: 2020-04-13 07:21 GMT

కాశీలో చిక్కుకుని పోయిన తెలుగు వారికి విముక్తి కల్పించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో నుంచి కాశీకి వెళ్లిన వారిని తిరిగి పంపించేందుకు ఏర్పాటు చేసింది. దాదాపు వెయ్యి మంది కాశీలో లాక్ డౌన్ సందర్భంగా చిక్కుకుపోయారు. వీళ్లంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. లాక్ డౌట్ కంటే ముందే చాలా మంది కాశీ యాత్రకు వెళ్లారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, కరీంనగర్ ఐదు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కాశీకి వెళ్లిన వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా కూడా తిరిగి వచ్చే సమయంలో ప్రభుత్వం ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో వీళ్లంతా అక్కడే స్థానికంగా ఉన్న ఆశ్రమాల్లో ప్రస్తుతానికి ఆశ్రయం పొందుతున్నారు. అయితే తమను తమ స్వస్థలాలకు పంపించాలంటూ అక్కడ ఉన్న అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. లాక్ డౌన్ ఉండటం వల్ల అక్కడే ఉండాలంటూ అధికారులు ఆదేశించారు.

పరీక్షలు చేసిన తర్వాత…..

దీంతో తమను తమ స్వస్థలాలకు పంపించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యాత్రికులు కోరారు. చివరకు వీళ్ళ విజ్ఞప్తి ఫలించిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెయ్యి మంది యాత్రికులను తిరిగి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు సంబంధించి కాశీ లో చిక్కుకుపోయిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించింది. వాళ్ళలో ఎవరికీ కరోనా లక్షణాలు లేకపోవడంతో వాళ్ళందరూ కూడా తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక బస్సులో కాశి యాత్ర ప్రయాణికులను తెలుగు రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పంపించి వేసింది. రేపటిలోగా కాశీయాత్రికులు అందరూ వారి స్వస్థలాలకు రాబోతున్నారు.

Tags:    

Similar News