కోడెల ఇలాకాలో రెండు వర్గాలు
సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కోడెల శివప్రసాద్ వర్గం ఇసుక కొరతపై జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తాహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగగా, [more]
సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కోడెల శివప్రసాద్ వర్గం ఇసుక కొరతపై జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తాహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగగా, [more]
సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కోడెల శివప్రసాద్ వర్గం ఇసుక కొరతపై జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తాహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగగా, రాయపాటి రంగబాబు కు చెందిన మరో వర్గం అన్నాక్యాంటీన్ల వద్ద ఆందోళనకు దిగింది. కోడెల శివప్రసాద్ గత ఎన్నికలలో సత్తెన పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో తమకు ఇన్ ఛార్జిగా రాయపాటి రంగబాబును నియమించాలని టీడీపీ లో ఒక వర్గం డిమాండ్ చేస్తుంది. అయితే దీనిపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రెండు వర్గాలుగా విడిపోయి ఆందోళనలకు దిగడంతో క్యాడర్ అయోమయంలో పడింది.