అక్కడ నామినేషన్లను బహిష్కరించిన టీడీపీ

తిరిగి నామినేషన్లు వేసుకోవడానికి అనుమతించినా తాము బహిష్కరిస్తున్నట్లు టీడీపీ పుంగనూరు ఇన్ ఛార్జి అనీషారెడ్డి తెలిపారు. తాము పుంగనూరు మున్సిపాలవటీ పరిధిలో 31 వార్డుల్లో తిరిగి నామినేషన్లు [more]

Update: 2021-03-03 00:56 GMT

తిరిగి నామినేషన్లు వేసుకోవడానికి అనుమతించినా తాము బహిష్కరిస్తున్నట్లు టీడీపీ పుంగనూరు ఇన్ ఛార్జి అనీషారెడ్డి తెలిపారు. తాము పుంగనూరు మున్సిపాలవటీ పరిధిలో 31 వార్డుల్లో తిరిగి నామినేషన్లు వేసుకోవడానికి అనుమతివ్వాలని ఎస్ఈసీని కోరామన్నారు. అయితే కేవలం మూడు వార్డులకు మాత్రమే ఎస్ఈసీ అనుమతించిందన్నారు. ఆ మూడు వార్డుల్లో కూడా తమ అభ్యర్థులను వైసీపీ భయభ్రాంతులకు గురి చేస్తుందని అనీషారెడ్డి తెలిపారు. దీంతో తాము నామినేషన్లను బహిష్కరిస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

Tags:    

Similar News