గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ లాంగ్వేజ్ ప్రాజెక్టుకు ఎంపికైన తెలుగు పోస్టు

GNI ఇండియన్ లాంగ్వేజెస్ ప్రోగ్రామ్ కింద.. ఎంపిక చేసిన వార్తా పబ్లిషర్‌లకు వారి కార్యకలాపాలను మెరుగుపరచడానికి, ఎక్కువ..

Update: 2023-07-20 08:59 GMT

Google News Initiative Indian Languages Program

భారతదేశంలోని స్థానిక వార్తా ప్రచురణకర్తల కోసం గూగుల్ సంస్థ ఇండియన్ లాంగ్వేజెస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ (GNI) ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రామ్ హిందీ, కన్నడ, తమిళం, తెలుగు వంటి ఎనిమిది భారతీయ భాషల్లో ఉంది. తప్పుడు సమాచారాన్ని పరిష్కరించడంలో పాత్రికేయులకు, న్యూస్‌రూమ్‌ల కోసం గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ సహాయపడుతుంది. పలు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. ఇప్పుడు గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ లోని లాంగ్వేజ్ ప్రోగ్రాంలో తెలుగు పోస్టు కూడా భాగమైందని మా రీడర్స్ కు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇకపై మరింత బాధ్యతతో మా కార్యకలాపాలను నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాం.

GNI ఇండియన్ లాంగ్వేజెస్ ప్రోగ్రామ్ కింద.. ఎంపిక చేసిన వార్తా పబ్లిషర్‌లకు వారి కార్యకలాపాలను మెరుగుపరచడానికి, ఎక్కువ మంది రీడర్స్ ను చేరుకోవడానికి శిక్షణ అందిస్తుంది. పేజ్ స్పీడ్, కోర్ వెబ్ వైటల్స్ వంటి వాటిలో ప్రచురణకర్తలకు శిక్షణ ఇస్తుంది. కంటెంట్ ఫార్మాట్‌లను, అదనపు ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడం వంటి అంశాలపై GNI మార్గనిర్దేశం చేస్తుంది. పోర్టల్ కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ రూపొందించడంతో పాటు బెస్ట్ ఇన్ క్లాస్ యూజర్ ఎక్స్ పీరియన్స్ ను రూపొందించడానికి సహాయ సహకారాలు, సాంకేతిక అమలు మద్దతుని GNI అందిస్తుంది.
ఎంపికైన పబ్లిషర్స్ కు వర్చువల్ వర్క్‌షాప్‌లు, గెస్ట్ టాక్స్.. సహా వివిధ కార్యకలాపాలకు హాజరయ్యే అవకాశం దక్కుతుంది. వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్, యూట్యూబ్, డేటా అనలిటిక్స్‌లో Google నేతృత్వంలోని సెషన్‌లకు కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. భారతదేశంలో గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ ట్రైనింగ్ నెట్‌వర్క్ ను 2018లో ప్రారంభించారు. డేటా లీడ్స్ భాగస్వామ్యంతో.. 54,000 మంది జర్నలిస్టులు, విద్యార్థులకు 15 కంటే ఎక్కువ భాషల్లో శిక్షణనిచ్చారు.


Tags:    

Similar News