తమిళనాడోళ్లు గొయ్యి తవ్వారు…ఏపీకి వాళ్లకు నో ఎంట్రీ

కరోనా నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తమిళనాడు అధికారులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో గోడ కట్టిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలోని [more]

Update: 2020-05-06 06:31 GMT

కరోనా నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తమిళనాడు అధికారులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో గోడ కట్టిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల్లో తమిళనాడు అధికారులు రోడ్డుపై పెద్ద గొయ్యి తవ్వారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతాపురం గ్రామంలో రోడ్డుపై తమిళనాడు అధికారులు గొయ్యి తవ్వడం వివాదాస్పదమయింది. తమ రాష్ట్రంలోకి ఎంట్రీ లేదని, కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువవుతుండటంతో గొయ్యి తవ్వినట్లు తమిళనాడు అధికారులు చెబుతున్నారు. హనుమంతపురం గ్రామ ప్రజలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు మధ్య ఉద్రిక్తత నెలకొంది.

Tags:    

Similar News