ఉగ్రమూకల ఘాతుకం… భారీ పేలుడు

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ సైనికుల కాన్వాయ్ లక్ష్యంగా బాంబు పేలుడుకు దాడికి తెగబడ్డారు. ఈ [more]

Update: 2019-02-14 12:44 GMT

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ సైనికుల కాన్వాయ్ లక్ష్యంగా బాంబు పేలుడుకు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 20 మంది జవాన్లు మరణించగా మరో 45 మంది గాయాలపాలయ్యారు. జమ్ము నుంచి శ్రీనగర్ కు 70 వాహనాల్లో 2500 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు కాన్వాయ్ గా బయలుదేరారు. పుల్వామా జిల్లాలో ఈ కాన్వాయ్ టార్గెట్ గా పేలుడు పదార్ధాలతో ఉన్న స్కార్పియో కారుతో సహా ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. దాడి నుంచి తేరుకోకముందే అక్కడే నక్కిన ఉగ్రమూకలు జవాన్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 2016లో జరిగిన ఉరి దాడి తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఈ దాడి తమ పనే అని పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

Tags:    

Similar News