" తెలియదు, నాకు గుర్తు లేదు " - చంద్రబాబు
సిఐడి ప్రశ్నలకు మొండిగా సమాధానమిస్తున్న చంద్రబాబు నాయుడు , కోర్టులో హాజరుపరిచేలోపు వైద్య పరీక్షలకు తీస్కెళ్ళనున్న సి ఐ డి .
సిఐడి ప్రశ్నలకు మొండిగా సమాధానమిస్తున్న చంద్రబాబు నాయుడు , కోర్టులో హాజరుపరిచేలోపు వైద్య పరీక్షలకు తీస్కెళ్ళనున్న సి ఐ డి , అదే సమయంలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ మరియు ఇతర కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. నాయుడును కలిసేందుకు భువనేశ్వరి, లోకేష్‌లను సీఐడీ అధికారులు అనుమతించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అక్రమాలకు సంబంధించి 20 సంబంధిత ప్రశ్నలను సీఐడీ అధికారులు సంధించారు.
సోర్సెస్: చంద్రబాబు విచారణకు సహకరించడం లేదు. అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సరిగా సమాధానం చెప్పడం లేదు
మధ్యమధ్యలో సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడంతో చంద్రబాబు చలించిపోయారు. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాలు మరియు హవాలా లావాదేవీలపై అధికారులు వివరించిన ఆయన ముఖ కవళికలు తీవ్రంగా మారాయి అని తెలిస్తుంది. ఆ సమయంలో అధికారులు రాసిన నోట్ ఫైళ్లను సీఐడీ అధికారులు చూపించగా ఆయన పాత్ర ఏమీ లేదని బాబు కొట్టిపారేశారు.
చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధుల మధ్య చంద్రబాబు వాట్సాప్ చాట్ ను కూడా సీఐడీ అధికారులు చూపించారు. చాటింగ్ గురించి ప్రశ్నించగా చంద్రబాబు అజ్ఞానం ప్రదర్శించారాని తెలుస్తోంది.
చాలా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం - నాకు తెలియదు, నాకు గుర్తు లేదు అని చెప్పారని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ఇది ఇలా ఉంటే చంద్ర బాబు ని కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి , తనయుడు లోకేష్ మరియు ఇతర కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు నారా బ్రాహ్మణి , నందమూరి బాల కృష్ణ హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానం లో విజయవాడ బయలుదేరారు.