టీఆర్ఎస్ లో తొలిసారి వేటు

Update: 2018-10-03 11:40 GMT

తెలంగాణ రాష్ట్ర సమితిలో అసంతృప్తులపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ 105 మంది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో అనేక నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రేగింది. అభ్యర్థులకు వ్యతిరేకంగా పలువురు నాయకులు పనిచేస్తున్నారు. దీంతో కేటీఆర్ స్వయంగా వారందరినీ హైదరాబాద్ కి పిలిపించుకుని మాట్లాడి బుజ్జగిస్తున్నారు. అయితే, వినకపోతుండటంతో ఇక సహించేది లేదని స్పష్టం చేసింది. పార్టీ నిర్ణయాన్ని జవదాటితే చర్యలు తప్పవని కేటీఆర్ తేల్చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మనుగోడు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించిన వేనేపల్లి వెంకటేశ్వర్ రావును పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ బహిష్కరణతో ఇతర అసంతృప్తులకు హెచ్చరిక జారీ చేసినట్లయింది.

Similar News