రవిప్రకాష్ అరెస్టు తప్పేలా లేదు..!

టీవీ9 మాజీ సీఈఓ, సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ కు మరోసారి చుక్కెదురైంది. హైకోర్టులో ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు సైతం [more]

Update: 2019-05-22 12:30 GMT

టీవీ9 మాజీ సీఈఓ, సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ కు మరోసారి చుక్కెదురైంది. హైకోర్టులో ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు సైతం ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్ ను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. టీవీ9 యాజమాన్యంతో వివాదంలో రవిప్రకాష్ పై పోర్జరీ, నిధుల మళ్లింపు వంటి కేసులు నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రవిప్రకాష్ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇవాళ మాత్రం ఆయన ఈ కేసులపై మొదటిసారి పెదవి విప్పారు. తన తప్పేమీ లేదని, తనపై జూపల్లి రామేశ్వరరావు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తాను విలువల కోసం పనిచేస్తున్నానని, తనకు అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు. అయితే, తాను ఎక్కడుంది మాత్రం రవిప్రకాష్ ఈ వీడియోలో చెప్పలేదు. రవిప్రకాష్ కోసం ఇప్పటికే మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ముందస్తు బెయిల్ రెండోసారి కూడా కోర్టు కొట్టివేయడంతో ఆయన అరెస్టు తప్పేలా లేదు.

Tags:    

Similar News