సంచలన విషయం బయటపెట్టిన ఉండవల్లి

Update: 2018-09-03 07:13 GMT

అమరావతి బాండ్ల వ్యవహారంపై, చంద్రబాబు నాయుడు తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైరయ్యారు. అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2 వేల కోట్ల అప్పుకు ప్రతీ మూడు నెలలకు 10.36 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అమరావతి బాండ్ల పేరుతో బ్రోకర్ కు రూ.17 కోట్లు ఇవ్వడమే చంద్రబాబు చెప్పే పారదర్శకతనా..? అని ఆయన ప్రశ్నించారు. బాండ్లు కొన్న తొమ్మిది మంది పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో చేసిన రూ.1.30 లక్షల కోట్ల అప్పుకు లెక్క చెప్పలన్నారు. చంద్రబాబు ‘విజన్ 2020’ రూపొందించిన సలహాదారు పాస్కల్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ జైల్లో ఉన్నారని తెలిపారు. పెట్రోల్, మద్యంపై ఎక్కడా లేని పన్నులు రాష్ట్రం వసూలు చేస్తోందని, రూ.50 క్వార్టర్ బాటిల్ లో రూ.37 ప్రభుత్వమే దండుకుంటోందని విమర్శించారు.

Similar News