దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం
మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగింది. 1993లో, బాంబు పేలుళ్లతో ముంబయిలో విధ్వంసం సృష్టించిన దావూద్ పాకిస్తాన్‌లో తల దాచుకుంటున్న సంగతి తెలిసిందే. కరాచీలో ‘రహస్యం’గా బతుకుతున్న ఈ అండర్‌వరల్డ్ డాన్‌పై ఆదివారం విష ప్రయోగం జరిగిందని మీడియా వెల్లడించింది.
కరాచీ ఆస్పత్రిలో చేరిక
మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగింది. 1993లో, బాంబు పేలుళ్లతో ముంబయిలో విధ్వంసం సృష్టించిన దావూద్ పాకిస్తాన్‌లో తల దాచుకుంటున్న సంగతి తెలిసిందే. కరాచీలో ‘రహస్యం’గా బతుకుతున్న ఈ అండర్‌వరల్డ్ డాన్‌పై ఆదివారం విష ప్రయోగం జరిగిందని మీడియా వెల్లడించింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు మాత్రం నిర్ధరించలేదు. దావూద్ అత్యంత పటిష్టమైన భద్రత మధ్య ఆస్పత్రిలో ఉన్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.
చాలామంది బాలీవుడ్ ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్న దావూద్ ముంబయి చీకటి సామ్రాజ్యాన్ని ఏళ్లపాటు పరిపాలించాడు. 1993లో ఆయన ఆధ్వర్యంలో, ముంబయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల వల్ల 257 మంది చనిపోయారు. 1500 మంది వరకూ గాయపడ్డారు. వందల కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. ఈ కేసులో డాన్ ప్రధాన ముద్దాయిగా తేలడం, పోలీసులు అతని కోసం వేటాడటంతో పాకిస్తాన్‌కు పారిపోయాడు. కరాచీలో మరో పెళ్లి చేసుకుని, ఆక్కడే సెటిల్ అయిపోయాడు.