బ్రేకింగ్ : టీడీపీని ధర్మాడి సత్యం కూడా బయటకు తీయలేరు

చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించలేకపోతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుకను వరదల సమయంలో ఎవరైనా బయటకు తీయగలరా? [more]

Update: 2019-11-14 11:51 GMT

చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించలేకపోతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుకను వరదల సమయంలో ఎవరైనా బయటకు తీయగలరా? అని ప్రశ్నించారు. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు ఏదైనా కనిపెట్టగలరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఎవరైనా మద్దతివ్వాలని వల్లభనేని వంశీ తెలిపారు. ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చంద్రబాబు చెప్పాలన్నారు. తెలుగును కాపాడే ధర్మం అందరి మీద ఉందన్నారు. తాను ముఖ్యమంత్రి జగన్ ను ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడాన్ని సమర్థిస్తున్నానని వల్లభనేని వంశీ తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు…?

టీడీపీని ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీగా పెట్టినా జాతీయ పార్టీగా ఎదిగిందన్నారు. కాని ఎన్టీఆర్ తర్వాత ప్రతి ఎన్నికలో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నారని, దీనివల్ల ప్రజల్లో నమ్మకం లేదన్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేశారని, కానీ పదేళ్లు మళ్లీ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కనపడలేదని, ఆయనను ఎవరు అడ్డుకున్నారని వల్లభనేని వంశీ తెలిపారు. భాజాభజంత్రీల సలహాలతో ధర్మపోరాట దీక్షను అనవసరంగా చేసిందన్నారు. చెప్పేందుకు టీడీపీలో ఎవరూ లేరన్నారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చంద్రబాబు ఎందుకు స్పందించలేదన్నారు. పవన్ కల్యాణ‌్ తెలంగాణలో ప్రశ్నించరని, ఏపీలో మాత్రం ప్రశ్నిస్తారన్నారు వల్లభనేని వంశీ. 2019 ఎన్నికలలో ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ నావ మునిగిపోతుందని, టీడీపీ నావను ధర్మాడి సత్యం టీమ్ కూడా బయటకు తీయలేదన్నారు. తాను కేసులకు భయపడి టీడీపీకి రాజీనామా చేయలేదన్నారు. మీ పుత్రరత్నం, సలహాదారుల వల్లనే టీడీపీ మునిగిపోతుందన్నారు. ధర్మ పోరాట దీక్షలు చేసి ఏం సాధించామని బంగీ జంప్ లు కొట్టేవాళ్లు చెప్పాలన్నారు. తాను వైసీపీ అధినేత జగన్ తో కలసి నడవాలని నిర్ణయించుకున్నానన్నారు. లోకేష్ తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News