Vijaya sai : ఇదివరకటి రోజులు కావు బాబూ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్యూను క్రియేట్ చేయడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం వంటివి [more]

Update: 2021-10-22 06:42 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్యూను క్రియేట్ చేయడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం వంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. వాటివల్లనే రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న జనాగ్రహ దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు.

ఓటమిని తట్టుకోలేక…..

ప్రతి ఎన్నికల్లో ఓటమి ఎదురు కావడంతో చంద్రబాబులో ఫ్రస్టేషన్ ఎక్కువయిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. దొంగదీక్షలకు దిగి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కానీ ఇంతకుముందు రోజులు కావని, ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. ముఖ్యమంత్రిని దూషించడంపై ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత కన్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News