వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, పూర్వపు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణదీక్షితులపై తిరుపతి కోర్టులో టీటీడీ 200 కోట్ల మేరకు పరువు నష్టం దావావేసింది. విజయసాయి రెడ్డి, రమణదీక్షితులు తిరుమల వెంకన్న పరువును తీశారని టీటీడీ ఈ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ వేయడానికి టీటీడీ కోర్టుకు ముందుగా రెండు కోట్ల రూపాయల ఫీజును చెల్లించింది. దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల వెంకన్న పరువును 200 కోట్లకు ఎలా వెల కడతారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రెండు కోట్ల రూపాయల టీటీడీ సొమ్మును ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. టీటీడీని తమ సొంత ప్రయోజనాలకు ప్రభుత్వం వాడుకుంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.