పేదల ప్రాణాలతో చెలగాటం ...?

Update: 2018-08-19 08:30 GMT

నిబంధనలకు తూట్లు పొడుస్తూ విశాఖ కెజిహెచ్ లో ఫార్మా కంపెనీలు సాగిస్తున్న ఔషధ ప్రయోగాలతో పేదల ప్రాణాలు గాల్లో ఊగుతున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి 100 మందికే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి లభించింది. కానీ 308 మందికి ఈ పరీక్షలు నిర్వహించినట్లు తేలింది. విషయం తెలియడంతో పలు ప్రజా సంఘాలు దీనిపై ఈ వ్యవహారంపై ఆందోళన మొదలు పెట్టాయి.

లక్షల రూపాయలు ఎరవేసి ...

పేదవర్గాల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఫార్మా కంపెనీలు అమానవీయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. క్లినికల్ టెస్ట్ లకు అంగీకరించే వారికి ఒక్కొక్కరికి నాలుగున్నర లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఫార్మా కంపెనీలు ఒప్పిస్తున్నాయి. వాస్తవానికి ఈ పరీక్షలు చేయడానికి అనుమతి పొందడంతో బాటు ఒక పర్యవేక్షకుడు ఉండాలి. అలాగే సంరక్షకుడు సంతకం చేయాలిసి ఉంటుంది. ఈ ప్రయోగాలను రికార్డ్ చేయాలిసి ఉంటుంది. కానీ ఇవేమి లేకుండా వందలాది మందిపై ఫార్మా కంపెనీలు ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఈ దారుణంపై తక్షణం ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలకు అంతా డిమాండ్ చేస్తున్నారు.

Similar News