విశాఖలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం మరో రికార్డుకు వేదికయింది. విరాట్ కొహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. సచిన్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ సరసన చేరనున్నారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరనున్నారు. 205 వన్డేల్లో కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం. వీటిలో మొత్తం 36 సెంచరీలు ఉన్నాయి. విరాట్ క్రీజ్ లో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు కన్పించక తప్పదు. కొహ్లి రికార్డులను అధిగమించాలంటే మరే భారత ఆటగాడికీ ఇప్పట్లో సాధ్యం కాదేమోనన్నది క్రికెట్ పండితుల విశ్లేషణ. విశాఖ స్టేడియంలో కొహ్లి పదివేల పరుగుల మైలురాయిని దాటారు. ప్రపంచ ఆటగాళ్లలో 13వ ఆటగాడిగా, భారత్ లో ఐదో ఆటగాడిగా ఈ రికార్డును కొహ్లి సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విశాఖలో వెస్ట్ ఇండిస్ తో జరుగుతున్న రెండో వన్డే లో టీంఇండియా మూడు వికెట్లకు 212 పరుగులు చేసింది. కొహల్ి 83 పరుగుల వద్ద క్రీజులో ఉన్నారు. ధోనీ 16 పరుగుల వద్ద ఉన్నారు.