ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగన్ పై దాడి విషయం తెలియగానే పెద్దఎత్తున తరలివచ్చారు. హత్యాయత్నానికి నిరసనగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.