Weather Report : పెరిగిన చలి తీవ్రత.. నాలుగు రోజులు వర్షాలే

Weather Report : పెరిగిన చలి తీవ్రత.. నాలుగు రోజులు వర్షాలే

Update: 2024-11-07 02:21 GMT

నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అకాల వర్షాలతో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని వాటి నుంచి తమను తామే రక్షించుకునేందుకు ప్రజలు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. లేకుంటే వివిధ రోగాల బారిన పడి ఆసుపత్రి పాలయ్యే అవకాశముంది.

కోస్తాంధ్రలో...
మరోవైపు తెలంగాణలోనూ నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పికే తెలంగాణలో చలితీవ్రత పెరిగింది. హైదరాబద్ లో ఒక్కసారిగా చలి పెరిగింది. తెల్లవారు జాము నుంచి చలికి తట్టుకోలేక ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. మార్నింగ్ వాకర్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని మాత్రమే బయటకు రావాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి వ్యాధులు సులువుగా సంక్రమిస్తాయని తెలిపింది. పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, రాత్రి వేళ చలి తీవ్రత పెరగడంతో తెలంగాణలో భిన్నమైన వాతావరణం నెలకొందని అధికారులు చెబుతున్నారు.
రాయలసీమలోనూ...
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కోస్తాంధ్ర ప్రాంతంలో నేడు ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలలో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. రాయలసీమలోనూ ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. రాయలసీమ జిల్లాలోని పలు చోట్ల మోస్తరు లేదా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు కూడా గతంలో కంటే కొంత తగ్గుతాయని పేర్కొంది. ప్రజలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు.


Tags:    

Similar News