ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ‘కమలం’ వెనుకబడుతోందా..?

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆయా పార్టీల నేతలు ఇప్పటి నుంచి వ్యూహాలు

Update: 2023-08-12 06:14 GMT

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆయా పార్టీల నేతలు ఇప్పటి నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయడంలో పొలిటికల్ హిట్ పెరిగింది. ఎలాగైన సరై వచ్చే ఎన్నికలలో తెలుగు రాష్ట్రాల్లో పాగ వేయాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. మిషన్ 75 టార్గెట్ గా పని చేయాలని అమిత్ షా ఏపీ, తెలంగాణ కమలం నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అయితే తెలంగాణ నేతలు మాత్రం ఇంకా ఆచరణలో పెట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే యాక్టివిటి అనుకున్నత రేంజ్ లో జరగడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అపజయం కావడం పట్ల ప్రభావం భారీగానే పడటంతో ఒక్కసారిగా పార్టీ నిరాశలో ఉండిపోయింది.

కర్ణాటక ప్రభావం ఇతర రాష్ట్రాలపై పడకుండనే ఉద్దేశంతో ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు అడుగులు వేస్తోంది బీజేపీ. ఇక ఇదంతా ఒక ఎత్తైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు పార్టీ నేతల్లో ఒక్కసారి షాక్ కు గురి చేసింది. అయితే పార్టీల్లో మార్పులు జరగడం సహజం అయినా.. తర్వాత ముందుకు వెళ్లేందుకు యాక్టివిటి పెద్దగా కనిపించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరాశ ఎదురవుతున్నట్లు నేతలు గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనా?

కాగా, బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఇతర పార్టీ నేతలు ఎప్పటి నుంచో నమ్ముతూ వస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం కంకణం కట్టుకున్నారు. పార్టీ మరింత బలోపేతం చేస్తూ కేసీఆర్ చెక్ పెడుదామనుకున్నా ఎలాంటి కార్యాచరణ లేకపోవడం కూడా కొంత వెనుకబడిపోతున్నారని భావిస్తున్నారు కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ను ఇరుకునపెట్టేందుకు ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నా.. వాటిని లేవనెత్తడంలో విఫలమయ్యారన్న చర్చ కూడా కొనసాగుతోంది బీజేపీ నేతలను మాట్లాడేందుకు పెద్దగా అవకాశం ఇవ్వకపోవడం, అందులో ఇచ్చిన సమయం కూడా అతి తక్కువ ఉండటం కూడా ఒక మైనస్సేనని సదరు నేతలు చెప్పుకుంటున్నారు.

ఇలా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నేతల్లో కొంత నిరాశ వ్యక్తం అవుతోంది. కొన్ని నెలల్లోనే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు గ్రౌండ్ లెవల్ లో పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కమలం పార్టీ బూత్ స్థాయి ఇన్ చార్జీల నియామకం, విస్తారక్, పాలక్ లను నియమించినా వారితో క్షేత్రస్థాయిలో పని చేయించుకోవడంతో విఫమవుతోందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చేస్తున్నారు. కొందరు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు సాగుదామని అనుకున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అడుగులు ముందుకు పడలేకపోతున్నట్లు కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న కేసీఆర్ వ్యూహాలపై బీజేపీ చెక్ పెడుతుందా..? లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News