సామాజిక మాధ్యమాలు ప్రాణాలు తీస్తున్నాయి. ప్రపంచాన్ని అరచేతిలో ఇమిడేలా వచ్చిన సాంకేతిక విజ్ఞానం పక్క మార్గాలకు వెళుతుండటంతో నెటిజెన్స్ ప్రాణాలు గాల్లో కలుస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. ఫేస్ బుక్, వాట్స్ ఆప్ ఇన్ స్ట్రాగ్రమ్ ట్విట్టర్ వల్ల చనిపోయారన్న వార్తలు వినని రోజు లేకుండా పోతుంది. స్కూల్ పిల్లల నుంచి నడివయస్కుల వరకు దీని ప్రభావం వ్యాప్తి చెందుతూ వస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ అభివృద్ధికి వినియోగించుకోవాలిసిన వారు మరో రకంగా దీనిని వినియోగిస్తుండటంతో అశాంతి ప్రతి ఇంటి గుమ్మంలో వేలాడుతుంది.
చాటింగ్ తెచ్చిన చావు ...
భాగ్యనగర్ మారేడ్ పల్లి ప్రాంతానికి చెందిన శివకుమార్, వెన్నెల ఆత్మహత్యలు అందరికి ఒక గుణపాఠాలు అనే చెప్పొచ్చు. ఇటీవలే వివాహం చేసుకున్న శివకుమార్ వెన్నెల అనే అమ్మాయితో నిత్యం చాటింగ్ లో గడపడంతో భార్య తీవ్రంగా మందలించింది. దాంతో మనస్థాపం చెందిన శివకుమార్ ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివకుమార్ మృతికి వెన్నెలే కారణమంటూ ఆమె చుట్టుపక్కల వారు వేధించడంతో భరించలేక ఆ మహిళా యాసిడ్ తాగి చికిత్స పొందుతూ కన్ను మూసింది. వీరిద్దరూ వాట్స్ ఆప్ చాటింగ్ కారణంగానే అర్ధాంతరంగా తనువు చాలించడం నేటి సాంకేతికతను వినియోగించుకోవడంలో యువత విఫలం అవుతున్న వైనాన్ని చాటి చెప్పింది. సో ప్రతి ఒక్కరు ఈ విషయంలో జాగర్తగా వుండాలని చెప్పక తప్పదు.