ట్రైనీ ఐపీఎస్ టార్చర్ పెడుతున్నాడే

కట్టుకున్న వాడే వరకట్న వేధింపులకు గురిచేస్తే ఏం చేస్తారు… పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మరి పోలీసు విభాగంలోనే ఉన్న వారే అలా చేస్తే ఏంచేయాలి. ఇప్పుడు అదే [more]

Update: 2019-10-29 07:51 GMT

కట్టుకున్న వాడే వరకట్న వేధింపులకు గురిచేస్తే ఏం చేస్తారు… పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మరి పోలీసు విభాగంలోనే ఉన్న వారే అలా చేస్తే ఏంచేయాలి. ఇప్పుడు అదే జరిగింది. ట్రైనీ ఐపీఎస్ కట్టుకున్న భార్యను వేధింపులకు గురిచేస్తే ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డి భార్య భావన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు..

మహేశ్ రెడ్డి ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అయిన తర్వాత తనను మోసం చేశారని ఫిర్యాదు చేసిన భావన తనను వివాహం చేసుకొని ఇప్పుడు తెలియదని చెప్తున్నాడని పేర్కొంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువు తున్న సమయంలోనే తమ పరిచయం జరిగిందని తెలిపింది భావన. ఈ పరిచయం ప్రేమ వివాహానికి దారితీసిందని, ఏడాది క్రితం గా పెళ్లి చేసుకొని ఒకే దగ్గర ఉంటున్నామని భావన చెప్పింది. మహేష్ ఐపీఎస్ సెలెక్ట్ కావడానికి తాను ఎంతో కృషి చేశానని భావన ఆవేదన వ్యక్తం చేసింది. ఐపీఎస్ గా సెలెక్ట్ కాగానే మహేష్ రెడ్డిలో మార్పు వచ్చిందని, అదనపు కట్నం తీసుకుని వస్తేనే కాపురం చేస్తానని చెప్పినట్లుగా ఫిర్యాదు చేసింది భావన .కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ మహేష్ రెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు.

 

 

Tags:    

Similar News