వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పది వేల కోట్ల రూపాయలను కాపు కార్పొరేషన్ కు కేటాయిస్తామంటున్న జగన్ కు తామే ఇరవై వేల కోట్లు ఇస్తామని, ముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వాలని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పది వేల కోట్లతో జగన్ కాపులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ముద్రగడ అభిప్రాయపడ్డారు. కాపు రిజర్వేషన్లపై జగన్ రోజుకో మాట మారుస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే తుని రైలు దగ్దం ఘటన కేసులన్నీ ఎత్తివేస్తామని జగన్ చెప్పడం కాపులను బుట్టలో వేసుకోవడానికేనని ముద్రగడ అన్నారు. కాపుల రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అధినేత పవన్ కల్యాణ్ చెప్పడాన్ని ముద్రగడ స్వాగతించారు.