శ్రీను గాడు...ఓ కత్తి స్టోరీ....!!

Update: 2018-10-31 03:02 GMT

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో కత్తితో దాడిచేసిన శ్రీను ను విచారిస్తున్న పోలీసులు ఎటువంటి సమాచారాన్ని రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది. మూడు రోజులు విచారించినప్పటికీ పెద్దగా ఫలితం కన్పించలేదు. ఆ కత్తిని ఎప్పుడు ఎయిర్ పోర్టులోకి శ్రీను తీసుకొచ్చాడు? ఎలా తీసుకొచ్చాడు? దీనివెనక ఎవరి సహకారం ఉందన్న సమాధానాలకు శ్రీను నుంచి సిట్ పోలీసులు రాబట్టలేకపోయారని చెబుతున్నారు.

కేజీహెచ్ లోనూ.....

నిజానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగినప్పుడు వెంటనే శ్రీను జగన్ వీరాభిమాని అని సాక్షాత్తూ డీజీపీ ఠాకూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న విచారణ సందర్భంగా అస్వస్థతకు గురైన శ్రీనును కేజీహెచ్ కు తీసుకురాగా, అక్కడ కూడా శ్రీను అదే చెప్పడం విశేషం. తాను జగన్ అభిమానినని, ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశానని, తన వెనక ఎవరూ లేరని శ్రీను చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

కాల్ డేటాను....

మూడు రోజులు విచారించినా పోలీసులు కత్తి ఎప్పుడు తీసుకొచ్చారో కనుగొనలేకపోయారు. అంతేకాదు శ్రీను తొమ్మిది నెలల్లో పది వేల కాల్స్ చేశారు. ఈ కాల్ డేటాను పరిశీలించిన అతని స్నేహితులే ఇందులో ఎక్కువగా ఉన్నారని తేల్చారు. మరోవైపు శ్రీను బ్యాంకు ఖాతాలో నలభై వేలు వేసిన వ్యక్తి ఎవరో తేల్చలేదు. మొత్తం మీద శ్రీనివాస్ విచారణ తూతూ మంత్రంగానే పోలీసులు చేస్తుననారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Similar News