జగన్ జైలుకెళ్లే ప్రసక్తే లేదు....!

Update: 2018-08-06 04:22 GMT

వైఎస్ జగన్ పై పెట్టిన కేసులేవీ రుజువు అయ్యేవి కావని, జగన్ జైలు కెళ్లేంత శిక్ష పడదని సీనియర్ నేత , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ పై పెట్టిన కేసులేవీ న్యాయస్థానంలో నిలబడవన్నారు. క్విడ్ ప్రోకో కేసుల్లో ఇప్పటి వరకూ భారతదేశంలో శిక్ష పడిన సందర్భాలు లేవన్నారు. తాను తొలి నుంచి అదే చెబుతున్నాన్ననారు. జగన్ జైలు కెళ్లే ప్రసక్తి లేదని, కాకుంటే జరిమానా పడే అవకాశముంటే ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసులన్నింటిలో ప్రధమ ముద్దాయిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని, జగన్ లబ్దిదారుడేనని ఆయన అభిప్రాయపడ్డారు.

బాబు చివరి నిమిషంలో......

తాను తొలినుంచి చెబుతున్నట్లు ఇప్పడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జగన్ కే అవకాశాలున్నాయని, అయితే ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉండటంతో చంద్రబాబు ఏదైనా చేయవచ్చన్నది తన అభిప్రాయమన్నారు. చంద్రబాబుకు ఎన్నికల మేనేజ్ మెంట్ చేసినంత ఎవరికీ తెలియదన్నారు. జగన్ కు ఎన్నికల మేనేజ్ మెంట్ చేసే వ్యూహకర్తలు లేరని తన అభిప్రాయమన్నారు. తాను జగన్ కు శల్య సారథ్యం చేయడం లేదన్నారు. ఏపీలో ఎన్ని ఫీట్లు చేసినా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ లాభపడేది లేదని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదన్నారు. పొత్తులు ఉంటే తాను చెప్పలేనన్నారు. తాను ప్రస్తుతం ఏపార్టీలో లేనని, పవన్ కల్యాణ్ పిలిచినా వెళ్లానని, ఏపీ అభివృద్ధికి అవసరమైన సలహాలు ఎవరు కోరినా ఇస్తానని చెప్పారు.

Similar News