అదే మెడపైన తగిలి ఉంటే...?

Update: 2018-10-25 07:53 GMT

విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్ లో ఉన్న రెస్టారెంట్ లో వైసీపీ అధినేత జగన్ పై వెయిటర్ శ్రీనివాస్ కత్తితో దాడి చేశారు. అయితే శ్రీనివాస్ దాడి చేసిన సమయంలో జగన్ పక్కకు తిరగడంతో ఆయనకు భుజంపైన గాయాలయ్యాయి. లేకుంటే మెడపైన తీవ్ర గాయాలయ్యేవని, జగన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే దాడి జరిగిన వెంటనే జగన్ నవ్వుతూ ఆ వ్యక్తి వైపు చూడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాడి జరిగిన సమయంలో జగన్ పక్కనే ఉన్న మాజీ ఎంపీ మిధున్ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావులాంటి నేతలు ఆ దుండగుడిపై చేయిచేసుకునే ప్రయత్నం చేసినా జగన్ వారించారు. జగన్ కు ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం ఫ్లైట్ హైదరాబాద్ కు పంపారు. జగన్ గన్ మెన్లు ఏమైపోయారని, ప్రతిపక్ష నేతకు కనీసం రక్షణ కొరవడటంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఒక ప్రతిపక్ష నేతపై నేరుగా దాడికి దిగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Similar News