పదకొండో జిల్లాలోకి వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రవేశించనుంది. మరికాసేపట్లో తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లాలోకి ఎంటర్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని విశాఖ జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా వైసీపీ శ్రేణులు జగన్ కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.
భారీ స్వాగత ఏర్పాట్లు.......
ఇప్పటి వరకూ పది జిల్లాల్లో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తయింది. విశాఖ జిల్లాలో పాదయాత్ర ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దగ్గరుండి చూస్తున్నారు. విశాఖ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా త్వరలోనే విశాఖ నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. అలాగే బ్రాహ్మణులు, ముస్లింలతో పాటు నార్త్ ఇండియన్స్ తో కూడా జగన్ ప్రత్యేకంగా ఆత్మీయ సదస్సుల్లో పాల్గొననున్నారు. విశాఖ జిల్లాలో భూకబ్జాలపై జగన్ స్పందించే అవకాశం ఉంది. భూ దందాలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా ఆ నివేదిను బయట పెట్టలేదు. జగన్ ను చూసేందుకు పెద్దయెత్తున ప్రజలు తరలి వచ్చారు.