ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి మరో మూడు, నాలుగు వారాల్లో కొత్త కుంభకోణం వెలుగు చూస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు జోస్యం చెప్పారు. జగన్ సొంత కంపెనీలకు సంబంధించిన కొత్త కుంభకోణం వెలుగులోకి వస్తే ఆయన ప్రజల ముఖంకూడా చూపించలేరని కుటుంబరావు చెప్పారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఒక బాంబు పేల్చారు. ఎస్సార్ ఆయిల్ కుంభకోణంలో బీజీపీ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంటుదని చెప్పారు.
పాదయాత్రకు స్పందన చూసి.......
ఎస్సార్ ఆయిల్ కుంభకోణం విషయాన్ని ఒక జాతీయ మ్యాగ్ జైన్ లో రెండు వారాల్లోగా కథనం ప్రసారమవుతుందని కుటుంబరావు చెప్పారు. అయితే ఈ విషయాలు కుటుంబరావుకు ఎలా తెలుసని వేసీపీ, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమపై మరో కుట్ర చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందని, తమ అధినేత పాదయాత్రకు వస్తున్న జనస్పందన చూసి ఓర్వలేక, ఓడిపోతామని భావించి ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయించి జగన్ పై కుట్ర చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుటుంబరావుకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా జనం నమ్మరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద మరోసారి జగన్ పై కుట్ర జరుగుతుందన్న అనుమానంతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు.