కోడి కత్తి హత్యాయత్నం కేసులో జగన్ కి విశాఖ 7 మెట్రో పాలిటన్ కోర్ట్ సమన్లు జారీ చేసింది. దాడిలో కీలక సాక్ష్యంగా వున్న రక్తపు మరకలతో వున్న చొక్కాను కోర్టుకి అందజేయాలని ఆదేశించింది. సిఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం దాడి కేసులో రక్తపు మరక చొక్కా విచాణలో అవసరం. ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసును విచారిస్తున్న సిట్ జగన్ రక్తపు మరక చొక్కా కోసం కోర్టు కి నివేదించారు. ఈ కేసును విచారిస్తున్న కోర్టు చొక్కా ను ఈ నెల 23 లోగా నేరుగా కానీ ఎవరితోనైనా తమ వారితో పంపించాలని కోరింది.
జగన్ సభతో వేడి పెరిగింది ...
జగన్ పార్వతీపురం లో నిర్వహించిన బహిరంగ సభలో తొలిసారి తనపై జరిగిన హత్యాయత్నం కేసుపై స్పందించారు. ఘాటైన వ్యాఖ్యలను నేరుగా టిడిపి అధినేతపై ఎక్కుపెట్టారు. హత్యాయత్నం వెనుక చంద్రబాబు వున్నారని డైరెక్ట్ అటాక్ ఇచ్చారు. తనను భౌతికంగా అంతం చేయడం, విఫలం అయితే ఆపరేషన్ గరుడ లో భాగమని ప్రచారం చేయడం వ్యూహంగా జగన్ వెల్లడించారు. బాబు పాత్ర తనపై దాడి కేసులో లేనిపక్షంలో స్వతంత్ర దర్యాప్త్ సంస్థ చేత ఎందుకు విచారణ చూపించలేక పోతున్నారని ఆరోపించారు.
సానుభూతి కోసమే ...
జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసు ను తీసిపారేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. హత్యా రాజకీయాలకు తెలుగుదేశం కానీ తాను కానీ వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. జగన్ సానుభుకోసమే ఇదంతా చేసి ఉంటారని విమర్శించారు. తనపై విపక్ష నేత చేసిన ఆరోపణలను, విమర్శలను ఖండించారు ఎపి సీఎం. దాంతో ఇప్పటివరకు కొంత చప్పగా నడుస్తున్న ఎపి పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి.