లాక్ డౌన్ ను పట్టించుకోకుండా..పోలీసులను ముప్పుతిప్పలు?
కొంతమంది యువకులు లాక్ డౌన్ ను పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ రోడ్ల మీదికి వస్తున్నారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని [more]
కొంతమంది యువకులు లాక్ డౌన్ ను పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ రోడ్ల మీదికి వస్తున్నారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని [more]
కొంతమంది యువకులు లాక్ డౌన్ ను పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. అవసరం లేకపోయినప్పటికీ రోడ్ల మీదికి వస్తున్నారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్తున్నారు. అత్యవసర పనులు తప్పించి ఎవరు కూడా రోడ్లమీదకు రావద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. కేవలం నిత్యావసరాల కోసమే బయటకు రావాల్సి ఉంటుందని చెప్పి ఆదేశాలు ఇచ్చాయి. అయితే చాలా మంది యువకులు మాత్రం రోడ్ల మీదకు వచ్చి జాయ్ రైడింగ్ చేస్తున్నారు . దీంతో పోలీసులు దెబ్బ తింటున్నారు. కొత్తగూడెం జిల్లా మధిరలో ఇలాంటి సంఘటనే బయటపడింది. అర్ధరాత్రి సమయంలో పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు . అయినప్పటికీ కూడా కొంతమంది యువకులు రోడ్ల మీదకు వచ్చి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు . ఇది గమనించిన ఉదయ్ కుమార్ పోలీస్ యువకులకు బుద్ధి చెప్తారు. అర్ధరాత్రి సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు యువకుల్ని ఎస్సై చితకబాదాడు . అంతేకాకుండా రోడ్డు మీద నిలబెట్టి చేతులు మీద కొట్టాడు. ఒక యువకుడు పారిపోతే అతన్ని వెంటపడి మరీ కొట్టాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే ఈ సంఘటనపై పోలీసులు సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఎస్ ఐ సస్పెన్షన్….
కరోనా నేపథ్యంలో అన్ని చోట్ల లాక్ డౌన్ ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దంటూ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం పోలీసు ఆగ్రహం గురికావాల్సి వస్తుంది. పెరుమల్లు పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో దుబాయ్ నుంచి ఒక యువకుడు వచ్చాడు . స్వీయ నియంత్రణ ను పాటించవలసి ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్లుగా గ్రామం మొత్తం కూడా తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. యువకుడి ఇంటికి చేరుకున్నారు . అప్పటికే యువకుడు ఇంటి బయట నిలబడి తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. ఇది గుర్తించిన ఎస్సై వెంటనే ఆగ్రహం కట్టలు తెగింది. ఒక్క సారి గా తన లాఠీకి పని చెప్పాడు. స్వీయ నియంత్రణలో ఉండాల్సిన వాడిని రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నావు అంటూ విచక్షణారహితంగా కొట్టాడు. అంతేకాకుండా జీప్ ఎక్కిన తర్వాత కూడా యువకుని చితక్కొట్టాడు . అడ్డం వచ్చిన తండ్రిని సైతం చితకబాదాడు. తండ్రి కొడుకులు ఆ సమయంలో అక్కడే ఉన్న యువకుడి తల్లి అడ్డుకునే ప్రయత్నం చేసింది. మహిళ అని చూడకుండా ఎస్ఐ ఆమె పైన కూడా తన లాఠీతో విచక్షణ రహితంగా కొట్టాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎస్సై పైన వెంటనే వేటు వేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు . ఇలాంటి సంఘటనలు ఎవరైనా నియంత్రణ పాటించకపోతే వారిని వెంటనే కౌన్సిలింగ్ ఇచ్చి హాస్పిటల్ కు తరలించాలని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పోలీసు అధికారులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువకులతో పాటు కుటుంబ సభ్యులపై లాఠీతో కొట్టిన ఎస్ ఐ ని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.