జగన్ స్కెచ్ వర్క్ అవుట్ అవుతుందా …?

రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు చదరంగాన్ని తలపిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. దేవతా మూర్తులకు జరుగుతున్న అపచారాలను ఎత్తి చూపుతూ విపక్షాలు చేస్తున్న [more]

Update: 2021-01-08 14:30 GMT

రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు చదరంగాన్ని తలపిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. దేవతా మూర్తులకు జరుగుతున్న అపచారాలను ఎత్తి చూపుతూ విపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో జగన్ సర్కార్ ఉక్కిరి బిక్కిరే అవుతుంది. ఒక పక్క ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, మరో పక్క బిజెపి – జనసేన ద్వయం హిందుత్వ అజెండా విషయంలో పోటీ పడి మరీ రాజకీయం సాగిస్తున్నాయి. క్రైస్తవ మతాన్ని నమ్మే ముఖ్యమంత్రిని ఈ పరిస్థితి ఇరకాటంలోకి నెడుతుంది. దాంతో దీనికి విరుగుడు ఆలోచించిన వైసిపి ముందుగా టిడిపి నోరు మూయించాలని నిర్ణయించింది.

కూలగొట్టిన దేవాలయాలను … ?

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడ లో అనేక దేవాలయాలను నాటి సర్కార్ తొలగించింది. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న వాటిని కూల్చేసింది. నాడు దీనిపై వివాదం చెలరేగితే ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించి నిర్మిస్తామని చెప్పి ఆ వాగ్దానం అటకెక్కించింది. అదే ఇప్పుడు వైసిపి కి ఆయుధంగా మారింది. చంద్రబాబు హయాంలో పడగొట్టిన ఆలయాలను జగన్ చేతుల మీద పునర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిస్తే ప్రధాన పక్షం ముఖ్యమంత్రిపై చేస్తున్న మత దాడి కి విరుగుడు లభించినట్లేనని వైసిపి వ్యూహం గా కనిపిస్తుంది.

ఈ హడావిడితో…..

ఈ మేరకు విజయవాడలోని దాదాపు 9 ఆలయాలకు నేడు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దుర్గగుడి అభివృద్ధికి 70 కోట్లను కేటాయించారు. దేవుడు పేరుతో జరుగుతున్న రాజకీయాన్ని అదే దేవుడి సెంటిమెంట్ తో తిప్పికొట్టాలన్నది అధికారపార్టీ ఆలోచన. ఇది టిడిపి కి వాత పెట్టేదే అయినా బిజెపి కి మాత్రం సమాధానం చెప్పినట్లు కాదు. మరి వారికి జగన్ ఏ స్కెచ్ వేస్తారు ? ఆలయాల పునర్ నిర్మాణ హడావిడి తో టిడిపి అనుసరించే కొత్త వ్యూహం ఎలా ఉంటుందనేది ఆసక్తికరమే.

Tags:    

Similar News